కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కొనసాగించాలి: మాజీ మంత్రి సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-30 16:08:07  IST  )

కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కొనసాగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన డిమాండ్ చేశారు..

కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కొనసాగించాలి: మాజీ మంత్రి సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: గత పదేళ్లలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్( Brs Chief Kcr) ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ సర్కార్ (Congress Government) కొనసాగించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) డిమాండ్ చేశారు. సిద్దిపేట(Siddipet)లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో(Ugadi Festival) ఆయన పాల్గొన్నారు. సన్నబియ్యం పథకాన్ని(Fine Rice Scheme) ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన పథకాలను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలన్నారు. కేసీఆర్ బీసీ బంధు, దళితులకు పది లక్షలు వంటి పథకాలను ప్రభుత్వం నిలిపివేసిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు.


త్వరలో సిద్దిపేటలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ(TTD) నిర్మించబోతోందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సాంప్రదాయాలను కేసీఆర్ గౌరవించేవారని చెప్పారు. ఆలయ ఉద్యోగులకు ప్రతినెలా జీతం వచ్చేలా చేశారని తెలిపారు. విదేశాల్లోని వారు తెలుగు(Telugu) చక్కగా మాట్లాడుతున్నారని, ఇక్కడి వాళ్లు మాత్రం సరిగా మాట్లాడలేకపోతున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

Next Story