హైకోర్టుకు మాజీ మంత్రి హరీశ్‌రావు.. బాచుపల్లి కేసును క్వాష్ చేయాలని పిటిషన్

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మరోసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టుకు మాజీ మంత్రి హరీశ్‌రావు.. బాచుపల్లి కేసును క్వాష్ చేయాలని పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మరోసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping)పై ఫిర్యాదు చేసినందుకు హరీశ్‌ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని చక్రధర్‌ గౌడ్‌ అనే వ్యక్తి బాచుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు A1గా వంశీకృష్ణ, A2గా హరీశ్‌రావు, A3గా సంతోష్ కుమార్‌, A4గా పరశురామ్‌లపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. దీంతో మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ ఆ కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ప్రస్తుతం ఆ పిటిషన్ రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉంది.

Next Story