CM రేవంత్ ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు?

by GSrikanth |
CM రేవంత్ ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు?
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గురువారం ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆయన నివాసంలో నిరసన వ్యక్త చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వందల హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు. డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ ప్రస్తావన కూడా తీసుకురావడం లేదని విమర్శించారు. రైతుబంధు, రైతుభరోసా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఛత్తీస్ ఘడ్ తరహాలో ఎకరాకు 500 బోనస్ ఇస్తామని రైతులకు ఎన్నికల్లో హామీ ఇచ్చి విస్మరించారన్నారు. రైతుల బోనస్‌కు ఆశపడి కాంగ్రెస్‌కు ఓటువేస్తే గద్దెనెక్కిన తరవాత మాట మార్చారన్నారు. బోనస్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. క్వింటల్ వడ్లకు 2200 రూపాయల మద్దతు ధరతో పాటు 500 బోనస్ ను బేషరతు గా అందించాలన్నారు.

Advertisement

Next Story