- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ మాట చెప్పడానికి సిగ్గు లేదా?: సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే గండ్ర ఫైర్
ప్రకృతి సహకరించకున్నా రైతులు పంట పండిస్తున్నారని.. రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రకృతి సహకరించకున్నా రైతులు పంట పండిస్తున్నారని.. రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నదని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లిలో ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కారని అన్నారు. రైతుల పక్షాన తాము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అమలు చేయడంలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని రైతులు అధికారంలోకి తీసుకువస్తే వారికి ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ఏ మీటింగ్ అయినా కేసీఆర్, కేటీఆర్ పేరు ఎత్తకుండా మాట్లాడడం లేదని అన్నారు. స్కూల్ పిల్లల మీటింగ్‌లో సైతం కేసీఆర్ పేరు ఎత్తకుండా మాట్లాడరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలనపై అనుభవం లేదని అన్నారు. కేంద్రం నుంచి ఎరువులు వస్తేనే తాము ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని, ఈ మాట చెప్పడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సేంద్రియ వ్యవసాయం చేయాలని అంటున్నారని.. కేంద్రం, రాష్ట్రం దొందూదొందే అని అన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ రోడ్డు ఎక్కడం ఖాయమని అన్నారు.






