చంచల్ గూడ జైలుకు మాజీమంత్రి గాలి జనార్థన్ రెడ్డి

by Ramesh Goud |   (  Updated:2025-05-06 16:00:09  IST  )

కర్ణాటక మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి (Gali Janardan Reddy)ని పోలీసులు చంచల్ గూడ జైలు (Chanchalguda Jail)కు తరలించారు.

చంచల్ గూడ జైలుకు మాజీమంత్రి గాలి జనార్థన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి (Gali Janardan Reddy)ని పోలీసులు చంచల్ గూడ జైలు (Chanchalguda Jail)కు తరలించారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ (Obulapuram Illegal Mining Case) కేసులో 14 ఏళ్ల విచారణ అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు (Namplly CBI Court) తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను దోషులుగా తేల్చిన కోర్టు.. మరో ఇద్దరిని నిందితులుగా పేర్కొన్నది. ఇందులో నలుగురికి ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల జరిమానా కూడా విధించగా.. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 2 లక్షల జరిమానా విధించింది.

ఇందులో బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, వీడి రాజగోపాల్, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, మెహఫస్ అలీఖాన్ దోషులు పేర్కొంటూ.. అప్పటి మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందంను నిర్ధోషులుగా ప్రకటించింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాలి జనార్ధన్ రెడ్డి సహా నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారు. దీంతో తనకు శిక్ష తగ్గించాలని ఆయన సీబీఐ కోర్టును కోరాడు. దీంతో గాలి జనార్ధన్ రెడ్డిపై కోర్టు సీరియస్ అయ్యింది. ఇందులో మీరు చేసిన నేరానికి యావజ్జీవ శిక్షకు అర్హులు అని, మీకు పదేళ్లు జైలు శిక్ష ఎందుకు వేయకూడదో చెప్పాలని తిరిగి ప్రశ్నించి, చట్ట ప్రకారం ఏడేళ్ల శిక్షను విధించింది.

Next Story