- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌ను ఐటెం సాంగ్‌తో పోలుస్తావా?.. CM రేవంత్‌పై మాజీ మంత్రి ఫైర్
కేటీఆర్ రోడ్ షోను ఐట్ సాంగ్ షూటింగ్ అనడం కరెక్ట్ కాదు.

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డికి పరిపాలన చేత కాకుంటే ఆర్.కృష్ణయ్య, మందకృష్ణకు అధికారం ఇచ్చి వెంటనే దిగిపోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పని అయిపోయిందనడం రేవంత్ మూర్ఖత్వమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నదని.. ఎన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయిందని.. దాంతో ఆ పార్టీ పని అయిపోయిందా అని నిలదీశారు. ఎన్నో రాష్ట్రాల్లో 30-40 యేండ్లు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉన్నదన్నారు. రేవంత్‌వి తెలివి తక్కువ.. సోయి లేని మాటలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రేవంత్‌రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో తిరిగినట్టు ఆరు రోజులు తిరిగారని.. అది సరిపోదన్నట్టు మీట్ ది ప్రెస్‌లోనూ పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. ప్రెస్‌క్లబ్‌కు వెళ్లాల్సిన సీఎం స్టార్ హోటల్‌కు వెళ్లారని.. ఆయనకు ప్రెస్‌క్లబ్ అంటే గౌరవం లేదని ఆరోపించారు. మీట్ ది ప్రెస్‌లో కొత్త బూతు పంచాంగం తప్ప ఇంకొకటి లేదన్నారు.
ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేశారని ప్రశ్నించారు. పీజేఆర్ గురించి మాట్లాడే హక్కు లేదని.. ఆయన కొడుకుకు జూబ్లీహిల్స్ టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజీ తెచ్చింది కేసీఆర్, కేటీఆర్ అని చెప్పారు. ఈ రెండేళ్లలో హైదరాబాద్‌కు ఐదు పైసలు ఇచ్చావా రేవంత్‌రెడ్డి అని నిలదీశారు. మానసిక రోగికి మించిన రోగి రేవంత్‌రెడ్డి అని.. నోరు తెరిస్తే అబద్ధాలేనని అన్నారు.ఇంత తెలివి తక్కువగా మాట్లాడే సీఎం ఎవ్వరూ లేరని అన్నారు. కేటీఆర్‌ను ఐటెం సాంగ్‌తో పోలుస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ రేఖల హద్దులు దాటేది తెలుసు. నీ తారా తోరణాల ఊహల గురించి తెలియదా?’ అని అన్నారు. ‘కవిత, మాగంటి తల్లి గురించి మాట్లాడుతున్నావ్. నీ సొంత అన్న కూతురి పెళ్ళికి నీ భార్య కుటుంబ సభ్యులు ఎందుకు పోలేదు?’ అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






