- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోరున విలపించిన ఎర్రబెల్లి దయాకర్ రావు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరు పెట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) కన్నీరు పెట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్(Thorrur Municipality) చైర్మన్ ఎన్నిక సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. చైర్మన్ ఎన్నికను తప్పుబడుతూ బోరున విలపించారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ కక్ష సాధింపులు చూస్తుంటే రాజకీయాల్లో అసలు ఉండాలా? వద్దా? అనేది తెలియడం లేదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇంత అప్రజాస్వామికంగా ఎవరూ వ్యవహరించలేదని వెల్లడించారు. బాధతో కన్నీళ్లు వస్తున్నాయని ఎమోషనల్ అయ్యారు. ప్రజలు తమకు పట్టం కడితే.. ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది అంటూ వ్యాఖ్యానించారు.
అప్రజాస్వామికంగా చైర్మన్ ఎన్నిక
తనను, తన భార్యను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. తొర్రూరులోని తన కార్యాలయానికి కూడా తనను వెళ్లనీయడం లేదని వాపోయారు. అప్రజాస్వామికంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. విప్ జారీ చేయాల్సిన తనను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు నిర్భందించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కోట్ల రూపాయల ఆశ చూసినా తమ కౌన్సిలర్లు లొంగలేదని.. ఎన్నికల వేళ కష్టపడిన కార్యకర్తలకు ఇప్పుడేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు అంటూ బాధపడ్డారు. అంతకుముందు తొర్రూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు.
'నాన్న' అని రాయలేరా అక్కా? కేసీఆర్ బర్త్‌డే వేళ కవిత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్






