- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్‌లో నేను లేను.. బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ఉన్న మాజీ మేయర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చర్చానీయంశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Jubilee Hills by-election) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎవరిని నియమిస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టికెట్ రేసులో ఉన్న మాజీ మేయర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ (Former Mayor Bonthu Rammohan) కీలక వ్యాఖ్యలు చర్చానీయంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీలో తాను లేనని బొంతు రామ్మోహన్ అన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ కావాలని నేను ఎవరినీ అడగలేదని, అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా కాంగ్రెస్ గెలుపు కోసం పూర్తి స్థాయిలో చేస్తానని ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి హైకమాండ్‌కు నలుగురి నేతల పేర్లను టీపీసీసీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సీఎం సూచనలతో నవీన్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిల పేర్లను పంపింది. వారిలో ఒకరి పేరును నేడు లేదా రేపు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. కాగా, జూబ్లీహిల్స్ టికెట్ రేసు నుంచి బొంతు రామ్మోహన్ తప్పుకున్నట్లు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.






