- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్?
తెలంగాణ స్థానిక ఎన్నికలు వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై పడింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్థానిక ఎన్నికలు వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై పడింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ(Telangana BJP) ఇంకా అనౌన్స్ చేయలేదు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్(Bonthu Rammohan) పేరును ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రతిపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అర్వింద్.. బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థ ఇంచార్జ్ చంద్రశేఖర్ తివారి, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అరవింద్ సహా పార్టీ పదాధికారులు పాల్గొన్నారు. బొంతు రామ్మోహన్ మంచి వ్యక్తి.. ఏబీవీపీ నుంచి పార్టీలో పనిచేశారు. ఆయనకు సిటీలో మంచి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉన్నది. అభ్యర్థిగా ప్రకటిస్తే గెలిచే అవకాశం ఉందని రాంచందర్ రావుకు ఎంపీ అర్వింద్ సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ రాగా ఈనెల 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. మరోవైపు ఈసారి ఎలాగైనా జూబ్లీహిల్స్‌లో పాగా వేయాలని అధికార కాంగ్రెస్ చూస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక యువనేత నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో అందరి చూపు ఇప్పుడు బీజేపీపై పడింది.






