ముగిసిన భేటీ.. రేవంత్‌ సర్కార్‌ను ప్రశంసించిన ‘దేవ్‌జీ’

by Gantepaka Srikanth |

మాజీ మావోయిస్టులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. గంటన్నరకు పైగా సుదీర్ఘంగా మాజీ మావోయిస్టులతో సీఎం చర్చించారు.

ముగిసిన భేటీ.. రేవంత్‌ సర్కార్‌ను ప్రశంసించిన ‘దేవ్‌జీ’
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మావోయిస్టులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం ముగిసింది. గంటన్నరకు పైగా సుదీర్ఘంగా మాజీ మావోయిస్టులతో సీఎం చర్చించారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. పొలిటికల్ ఎజెండాపైన పలు రకాలుగా దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్‌, చంద్రన్నలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు దేవ్‌జీ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, ఐజీలకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలన బాగుందని ప్రశంసించారు.

Next Story