- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MV Maisura Reddy : కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది అంటే ఒప్పుకోను : మాజీ హోం మంత్రి మైసూర రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(United AP) లో హోంమంత్రిగా విధులు నిర్వహించిన సీనియర్ నేత ఎం.వి మైసూరా రెడ్డి(MV Maisura Reddy) ప్రస్తుత రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(United AP) లో హోంమంత్రిగా విధులు నిర్వహించిన సీనియర్ నేత ఎం.వి మైసూరా రెడ్డి(MV Maisura Reddy) ప్రస్తుత రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలకు దూరంగా ఉండటం వల్లే ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ వల్ల తెలంగాణ(Telangana) వచ్చిందంటే తాను అంగీకరించనని, సోనియా గాంధీ(Sonia Gandhi) అనుకోవడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో నమ్మకంగా ప్రజలు కేసీఆర్ కు ఓటేశారని, అయితే వాస్తవానికి సామాన్యుల కలలు నిజం కాలేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పెద్దమొత్తంలో అప్పులు చేయడం, అభివృద్ధిపై దృష్టి పెట్టక పోవడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజలకు ఎన్నడూ అందుబాటులో లేకపోవడం కూడా ఓ కారణం అని తెలిపారు.
ప్రస్తుతం రాజకీయాలు అధ్వాన్నంగా తయారయ్యాయని పేర్కొన్న ఆయన.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు తొందరపాటు ఎక్కువైందన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీలపై వెంటనే విమర్శలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ధోరణిని ప్రజలు హర్షించరని తెలియజేశారు. రాజకీయాల్లో విమర్శించడం తప్పు కాదని, కానీ ఉపయోగించే భాష చాలా ముఖ్యమని మైసూరా రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ(TDP) తరపున అనేక పదవులు నిర్వర్తించిన మైసూరారెడ్డి.. రాజ్యసభ సభ్యునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. జగన్ ను సీబీఐ అరెస్ట్ చేసే కొన్నిరోజుల ముందు వైసీపీ(YSRCP)లోకి వెళ్ళిన ఆయన.. జైలు నుంచి జగన్ బయటికి వచ్చేంత వరకు పార్టీని తెలివిగా ముందుకు నడిపించారు. అనంతరం పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గే కొద్దీ.. పార్టీకి దూరంగా ఉంటున్నారు.






