తెలంగాణలో మద్యం ధరలు పెంచితే జరిగేది ఇదే.. ఎక్సైజ్ మాజీ మినిస్టర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-19 11:42:57  IST  )

తెలంగాణలో మద్యం ధరలు(Alcohol Prices) పెరగబోతున్నాయంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) స్పందించారు.

తెలంగాణలో మద్యం ధరలు పెంచితే జరిగేది ఇదే.. ఎక్సైజ్ మాజీ మినిస్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మద్యం ధరలు(Alcohol Prices) పెరగబోతున్నాయంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) స్పందించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం.. పేదలకు పంచుతాం అని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. పెంచుతాం అంటే రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తారని అనుకున్నాను.. కానీ ఇలా మద్యం రేట్లు పెంచుకుంటూ పోతారని ఊహించలేదు అని అన్నారు. మద్యం రేట్లు పెంచితే రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొత్తగా 604 బ్రాండ్లకు అనుమతిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.


పక్క రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంతో నాసిరకం మద్యం తాగి ఎందరో మరణించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావాలని కోరుకుంటున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యం ధరలు 10 శాతం పెంచితే సామాన్యులపై భారం పడుతుందని అన్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. 36 వేల 500 కోట్ల రూపాయలుగా ఉన్న మద్యం ఆదాయాన్ని 50 వేల కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. నాసిరకం మద్యం బ్రాండ్లు తెస్తే సహించేది లేదని హెచ్చరించారు.

మద్యాన్ని టెట్రా ప్యాక్‌లలో అనుమతి ఇస్తే అన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం వినియోగం పెరిగే ప్రమాదముందని అన్నారు. ఫ్రూటీ ల్లాగా టెట్రా ప్యాక్‌ల్లో అమ్మితే మద్యాన్ని పిల్లలు కూడా తాగే ప్రమాదముందని తెలిపారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు నిషేధించకపోగా.. టెట్రా ప్యాక్‌ల్లో మద్యం పంపిణీ చేయడం అవివేకమైన చర్య అని విమర్శించారు. బార్ షాప్‌ల సంఖ్యను కూడా విపరీతంగా పెంచుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో నకిలీ మద్యాన్ని కట్టడి చేశాం.. తాము టెట్రా ప్యాక్‌ల ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం పరిస్థితి జమ్మూ కాశ్మీర్ కన్నా దారుణంగా తయారైందని అన్నారు.

Next Story