HYD: హరీష్ రావు ఇంటికి మాజీ డీజీపీ అంజనీకుమార్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ఇంటికి తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకమార్(Anjani Kumar) వచ్చారు.

HYD: హరీష్ రావు ఇంటికి మాజీ డీజీపీ అంజనీకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ఇంటికి తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకమార్(Anjani Kumar) వచ్చారు. ఇటీవల తండ్రి సత్యనారాయణ రావును కోల్పోయి బాధలో ఉన్న హరీష్ రావును కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రావు చిత్రపటానికి అంజనీకమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంజనీకుమార్ వెంట మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) కూడా ఉన్నారు. అనంతరం శాసనమండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాశ్ కూడా హరీష్ రావును పరామర్శించారు. కాగా, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్.. డిసెంబర్ 31, 2022న తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘించారని ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన వివరణతో సస్పెన్షన్ ఎత్తివేసింది. అంతకుముందు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు.

Next Story