తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి యాక్షన్ స్టార్ట్ అయిందా?

by Disha Web Desk 2 |
తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి యాక్షన్ స్టార్ట్ అయిందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. సమైక్యవాదిగా పేరు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఏ మేరకు పార్టీకి ఉపయోగపడతారనే టాక్ వినిపించింది. కానీ తాజా పరిణామాల వెనుక కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. తాజాగా గురువారం కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ వెనుక కిరణ్ కుమార్ రెడ్డి మాస్టర్ స్కెచ్ ఉందనే విమర్శలు స్వయంగా టీ కాంగ్రెస్ నేతల నుంచి రావడం హాట్ టాపిక్ అవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత కోందడ రెడ్డి ఆరోపించారు. సీఎం పదవి ఇస్తే పార్టీ్కే నష్టం చేశాడని ధ్వజమెత్తారు.

మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిక వెనుక కూడా కిరణ్ కుమార్ రెడ్డినే ఉన్నారని ఆరోపించారు. టీ-కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఎవరు వెళ్లినా దానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణం అన్నారు. పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌ను నష్టపరిచిందే కాకుండా ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఇప్పటికే నష్టం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూడటం మంచిది కాదని అన్నారు. అయితే టీకాంగ్రెస్ నేతలు చేస్తున్నా తాజా వాదన ఆసక్తిగా మారింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ యాక్టివ్ కాబోతున్నారా అనేది చర్చనీయాశం అవుతోంది.

మల్కాజ్ గిరి బరిలో కిరణ్ కుమార్ రెడ్డి?

ఇటీవలే కాషాయగూటికి చేరిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పోషించబోయే రోల్‌పై రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వాదన బలంగా వినిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఆంధ్రా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. సమైక్యవాదిగా ముద్ర పడిన కిరణ్ కుమార్‌ను బరిలోకి దింపడం వల్ల బీజేపీ అనుకూల ఓట్లతో పాటు ఆంధ్రా సెటిలర్ల ఓట్లను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని కమలం పెద్దలు భావిస్తున్నట్లు టాక్. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల బరిలో నిలిస్తే అది మళ్లీ ఆంధ్రా వర్సెస్ తెలంగాణ ఫైట్‌గా మారి అంతిమంగా బీఆర్ఎస్‌కు కలిసి వస్తుందనే ప్రచారమూ జరుగుతోంది. దీంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రోల్ ఎలా ఉండబోతోందనేది భవిష్యత్తులో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read...

ఎన్నికల ఏడాదిలో చిక్కుల్లో కాంగ్రెస్.. ఏలేటి బాటలో మరి కొంతమంది నేతలు?


Next Story

Most Viewed