TS : నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్కో MP స్థానంలో ఎంత మంది పోటీలో ఉన్నారంటే..?

by Disha Web Desk 4 |
TS : నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్కో MP స్థానంలో ఎంత మంది పోటీలో ఉన్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారంతో ముగిసింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్కో ఎంపీ స్థానంలో ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారనే విషయాన్ని అధికారులు వెల్లడించారు. కరీంనగర్ ఎంపీ బరిలో 28 మంది అభ్యర్థులు నిలవగా.. ఐదుగురు క్యాండిడేట్లు పోటీ నుంచి తప్పుకున్నారు. భువనగిరి ఎంపీ బరిలో 39 మంది నిలిచారు. ఈ స్థానం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఖమ్మం ఎంపీ బరిలో 35 మంది పోటీలో ఉండగా.. ఆరుగురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత వరంగల్ ఎంపీ బరిలో మొత్తం 42 మంది ఉన్నారు. ఈ స్థానంలో ఆరుగురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. మెదక్ ఎంపీ బరిలో 44 మంది ఉండగా.. 9 మంది ఈ స్థానం నుంచి పోటీ నుంచి తప్పుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకున్నారు. జహీరాబాద్ లో 19 మంది పోటీలో ఉండగా.. ఏడుగురు అభ్యర్థులు డ్రాప్ అయ్యారు.

పెద్ద పల్లి ఎంపీ బరిలో నుంచి ఏడుగురు అభ్యర్థులు తప్పుకోగా.. మొత్తం 42 మంది పోటీలో ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో 8 మంది అభ్యర్థులు తప్పుకోగా.. 30 మంది బరిలో ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బరి నుంచి ముగ్గురు తప్పుకోగా 29 మంది పోటీలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

పెద్దపల్లి -42

కరీంనగర్ - 28

నిజామాబాద్ - 29

జహీరాబాద్ -19

మెదక్ - 44

మల్కాజిగిరి - 22

హైదరాబాద్ -30

చేవెళ్ల-43

మహబూబ్ నగర్ -31

నాగర్ కర్నూలు-19

నల్గొండ -22

భువనగిరి-39

వరంగల్ - 42

మహబూబాబాద్ - 23

ఖమ్మం - 35

Next Story