- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీకి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు సుమారు ఏడాది విరామం తర్వాత ఈరోజు అసెంబ్లీకి చేరుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు సుమారు ఏడాది విరామం తర్వాత ఈరోజు అసెంబ్లీకి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని తన నందినగర్ నివాసం నుండి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన కాన్వాయ్‌లో అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ ప్రియతమ నేతను చూసేందుకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ఆయన వాహనంపై పూలు చల్లుతూ ఉత్సాహం ప్రదర్శించారు. కేసీఆర్‌కు ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ఆకాంక్షిస్తూ మహిళా కార్యకర్తలు ఆయన వాహనానికి దిష్టి తీశారు. "జై కేసీఆర్" అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. మరికొద్ది నిమిషాల్లోనే ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రిజిస్టర్లో కేసీఆర్ సంతకం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అడుగుపెడుతుండటంతో, అక్కడ చర్చలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమీపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






