KCR: తన సోదరి సకలమ్మ పార్థివదేహానికి కేసీఆర్‌ నివాళి..

by Ramesh Naini |   (  Updated:2025-01-25 07:20:37  IST  )

దివంగతులైన తన అక్క చీటి సకలమ్మ పార్థివ దేహానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు.

KCR: తన సోదరి సకలమ్మ పార్థివదేహానికి కేసీఆర్‌ నివాళి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగతులైన తన అక్క చీటి సకలమ్మ పార్థివ దేహానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ((Former CM KCR)) శ్రద్ధాంజలి ఘటించారు. ఇవాళ‌ ఉదయం మునిరాబాద్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్‌.. సోదరి పార్థివదేహానికి నివాళులర్పించారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులను బంధువులను కేసీఆర్ ఓదార్చారు. తొడబుట్టిన ఐదవ సోదరి కన్నుమూయడంతో ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆమె పార్థివదేహానికి (KTR) కేటీఆర్, (Harish Rao) హరీష్ రావు, కవిత (MLC Kavitha) నివాళులర్పించారు.

సకలమ్మ అంతిమ యాత్ర కొనసాగుతున్నది. పూడూరులోని స్మశానవాటికలో సకలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంతిమయాత్రలో బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌ రావు, కవిత ఇతర కుటుంబ సభ్యులు పాల్గాన్నారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్‌కు చీటి సకలమ్మ (82) ఐదవ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. భర్త హన్మంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. సకలమ్మ కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

Next Story