అభిమానులకు కేసీఆర్ అభివాదం.. నందినగర్‌ వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు

by Ramesh Naini |   (  Updated:2026-02-01 15:52:42  IST  )

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం సిట్ విచారణ ముగిసింది.

అభిమానులకు కేసీఆర్ అభివాదం.. నందినగర్‌ వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని నంది‌నగర్‌లో ఉన్న నివాసంలో రెండో అంతస్తులోని ఓ గదిలో నాలుగు గంటల 50 నిమిషాలపాటు సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారించారు. కేసులో నిందితులుగా ఉన్న వారి స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్‌ని సిట్ బృందం విచారించింది.

సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ నుంచి నందినగర్‌కు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. సిట్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటికే నివాసం వద్దకు తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు కేసీఆర్ అభివాదం చేసి.. కాసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లిపోయారు. దీంతో జై కేసీఆర్, జై తెలంగాణ, సీఎం.. సీఎం.. అంటూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నందినగర్ నివాసం నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కి కేసీఆర్ బయలుదేరుతున్నట్లు తెలిసింది.

Next Story