- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: కాంగ్రెస్‍లోకి వచ్చేందుకు బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రయత్నం.. కడియం సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలోకి (Congress Party) వచ్చేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) ప్రయత్నించారని స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadyaam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎర్రబెల్లి దయకర్ నీచ బుద్ధి సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆయనను పార్టీలోకి రానివ్వలేదన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి.. ఎర్రబెల్లికి సీఎం రేవంత్ రెడ్డిని అనే స్థాయి లేదని దుయ్యబట్టారు. చిన్న మెదడు చితికి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదన్నారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓడిపోయారని హోల్ సేల్ గా టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్‍కు అమ్మిన చరిత్ర ఆయనదని విమర్శించారు.
గజ దొంగకు తోడు ముగ్గురు స్టువర్టుపురం దొంగలు:
గజ దొంగ రాజయ్యకు తోడుగా మరో ముగ్గురు స్టువర్టు పురం దొంగలు తోడయ్యరాని 2023లో రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్‍కు ఎర్రబెల్లి, పోచంపల్లి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారని ఆరోపించారు. మున్సిపాలిటీని గెలిపించే పరిస్థితి రాజయ్యకు లేదని కేసీఆర్ కు చెప్పి ముగ్గురు స్టేషన్ ఘన్ పూర్ కు ఇన్ చార్జీలుగా ఉండి రాజయ్యను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.






