Satyavati Rathod : ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రి

by Muthe.Rajitha |   (  Updated:2025-05-27 13:59:49  IST  )

బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Satyavati Rathod) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.

Satyavati Rathod : ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Satyavati Rathod) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. తీవ్ర మోకాళ్ల సమస్య కారణంగా సత్యవతి గత రెండు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లోఅడ్మిట్ అయ్యారు. కాగా ఆసుపత్రి వైద్యులు ఆమెకు మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స(Knee Replacement Surgery) చేశారు. ఈ ఆపరేషన్ అనంతరం పలువురు గులాబీ పార్టీ నాయకులు సత్యవతిని పరామర్శించారు. సోమవారం సాయంత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆమెను ఆస్పత్రిలో కలిసి, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే మరో బీఆర్ఎస్ నాయకుడు బానోత్ శంకర్ నాయక్, ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సత్యవతి రాథోడ్‌ను పరామర్శించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు.

Next Story