- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ మార్పు వార్తలపై జీవన్ రెడ్డి స్పష్టత.. కార్యకర్తలు, అభిమానులకు కీలక విజ్ఞప్తి
గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన తెగేసి చెప్పారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికే ఇటువంటి పుకార్లను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. "నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారి వెంటే ఉంటాను. ఆయన నాయకత్వంలో పనిచేయడం నాకు గర్వకారణం" అని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు..
తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలు, అభిమానులు ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, తాను ఎప్పటికీ బీఆర్ఎస్ సైనికుడిగానే కొనసాగుతానని భరోసా ఇచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి, పార్టీ మారుతారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగింది. అయితే నేడు ఆయన స్వయంగా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లకు చెక్ పడినట్లయింది.






