- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కల్చర్ మరిచి విమర్శలా.. కేటీఆర్‌కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీకి దేశం పట్ల ఏ విజన్ లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి దేశం పట్ల ఏ విజన్ లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం కేవలం తమ స్వార్థం కొరకు మాత్రమే పోరాటం చేసిందని ఆరోపించారు. రాహుల్ గాంధీని పట్టుకుని ఆయనకు విజన్ లేదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. రాహుల్‌ను విమర్శించే స్థాయి, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు కేటీఆర్‌కు లేదన్నారు.
తమ మాటలు వింటే రాహుల్ గొప్పతనం కేటీఆర్‌కు తెలుస్తుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ కుటుంబాన్నే విమర్శిస్తారా అని ప్రశ్నించారు. ఆ కుటుంబం తెలంగాణ ఇస్తేనే మీ కుటుంబ సభ్యులు సీఎం అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ సంస్కృతిని మరిచి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వద్దని చెబితే నిర్ణయం ఆగిపోయి ఉండేదని రాహుల్ అన్నారు. ఏపీలో పార్టీ నష్టపోతుందని తెలిసీ నిర్ణయం తీసుకున్న దమ్ము, ధైర్యం సోనియా గాంధీకే ఉన్నాయని తెలిపారు.






