- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతుల రాళ్లదాడి.. ఐదుగురికి తీవ్రగాయాలు
by Naga Rani Yarlagadda |
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది, పోలీసుల్ని పోడు రైతులు..

X
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది, పోలీసుల్ని పోడు రైతులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ రాళ్ల దాడి చేయడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆందోళన కారుల దాడిలో పోలీస్ వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఫారెస్ట్, పోలీస్, మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో.. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు.
Next Story






