- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: కొండగట్టు అంజన్న ఆలయానికి(Kondagattu Anjanna Temple) అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. 684 బ్లాక్ అటవీశాఖ పరిధిని ఆక్రమించారంటూ నోటీసుల్లో పేర్కొంది. మొత్తం ఆరు ఎకరాల అటవీశాఖ భూమిని ఆక్రమించారని అటవీశాఖ ఆరోపించింది. అంతేకాదు.. ఆక్రమించిన భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ నోటీసులో ప్రస్తావించింది. అటవీ భూమిలో నాన్-ఫారెస్ట్ పనులు చేపట్టడానికి కన్సర్వేషన్ యాక్ట్ 2A ప్రకారం కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అని నోటీసులో స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా, ఫారెస్ట్ వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ యాక్ట్‌లోని 3A మరియు 3B సెక్షన్ల కింద ఈ నోటీసులు ఇవ్వబడ్డాయి. ఈ నోటీసులకు తగిన వివరణ ఇవ్వని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ ఆలయ అధికారులను హెచ్చరించింది.
Next Story






