ఫోరోన్సిక్ నియామక ఫలితాలు విడుదల

by Bhoopathi Nagaiah |

రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఖాళీగా ఉన్న 59 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

ఫోరోన్సిక్ నియామక ఫలితాలు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఖాళీగా ఉన్న వివిధ విభాగాలలో 60 పోస్టులకుగాను 59 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 నవంబర్ 14న 60 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 59 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని, అభ్యర్థుల అకడమిక్ మార్కులు, పని అనుభవం రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో అటెస్టేషన్ ఫారాలను పూర్తి చేసి, మార్చి 30న హైదరాబాద్‌లోని పెట్లబుర్జ్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Next Story