- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay : ప్రతి జిల్లాకో ఫోరెన్సిక్ ల్యాబ్ : బండి సంజయ్
దేశంలో ప్రతి జిల్లాకో ఫోరెన్సిక్ ల్యాబ్(Forensic Lab) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ప్రతి జిల్లాకో ఫోరెన్సిక్ ల్యాబ్(Forensic Lab) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం(National Judicial Infrastructure Development Scheme) కింద దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.2,254.43 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని అన్నారు. ఈ పథకం ద్వారా ఫోరెన్సిక్ కేంద్రాల్లో అత్యాధునిక సాంకేతికతలైన కృత్రిమ మేధస్సు(AI), మెషిన్ లెర్నింగ్, ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ను అమలు చేయనున్నారు. కొత్త నేర న్యాయ చట్టాలు(BNS, BNSS, BSA) పకడ్బందీగా అమలు కావాలంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ తప్పనిసరని అని పేర్కొన్నారు.
ఈ యూనిట్లు నేర దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ, విశ్లేషణను వేగవంతం చేసి, న్యాయ వ్యవస్థలో ఖచ్చితత్వం, సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. ఈ పథకం 2024-25 నుండి 2026-27 వరకు అమలు చేయబడుతుందని.. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 9 కొత్త ఫోరెన్సిక్ లాబొరేటరీలు, 29 ఫోరెన్సిక్ టీమ్‌లు, 900 ఫోరెన్సిక్ వాహనాలు, 37,000 మంది ఫోరెన్సిక్ నిపుణుల శిక్షణ కార్యక్రమాలు, 650 జిల్లా ఫోరెన్సిక్ యూనిట్ల ఏర్పాటు జరుగుతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నేరాల విచారణలో వేగవంతం అవుతుందని, అలాగే పారదర్శకత పెరిగి, సరైన న్యాయం అందించడంలో సహాయపదుతుందని బండి సంజయ్ తెలిపారు.






