ఎవరి ప్రయోజనాల కోసం GHMC విస్తరణ.. ప్రభుత్వానికి KTR సూటి ప్రశ్న

by Kema Shiva Kumar |

ఎవరి ప్రయోజనాల కోసం జీహెచ్‌ఎంసీ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎవరి ప్రయోజనాల కోసం GHMC విస్తరణ.. ప్రభుత్వానికి KTR సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవరి ప్రయోజనాల కోసం జీహెచ్‌ఎంసీ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవాళ వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ విస్తరణకు గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, మున్సిపాలిటీల అభిప్రాయం అక్కర్లేదా అని మండిపడ్డారు. పెద్ద పెద్ద మాల్స్ కట్టుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకే భూమిని ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. టెక్స్‌టైల్ పార్క్‌తో 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. త్వరలో రెండు, మూడు కంపెనీలు కూడా ఉత్పత్తిని ప్రారంభించబోతున్నాయని తెలిపారు. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గతంలో 24 శాతం ఉన్న రిజర్వేషన్లు 17 శాతానికి తగ్గాయని ఎద్దేవా చేశారు. కొన్ని మండలాల్లో దారుణంగా ఒక్క గ్రామానికి కూడా బీసీ రిజర్వేషన్లు దక్కలేదన్నారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని మోసం కాకపోతే ఇంకేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story