- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో అన్నదాతలు అరిగోస పడుతుండ్రు.. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకునే నాథుడు లేక అన్నదాతలు అరిగోస పడుతుండ్రని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకునే నాథుడు లేక అన్నదాతలు అరిగోస పడుతుండ్రని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. రైతుల సాగు కష్టాలపై ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. పదేళ్ల కేసీఆర్ (KCR) పాలనలో వ్యవసాయాన్ని ఓ పండగలా మార్చితే.. కాంగ్రెస్ (Congress) ఏడాదిన్నర పాలనలో అన్నదాత అరిగోస పడుతున్నాడని ఫైర్ అయ్యారు. వానాకాలం సాగు పనుల్లో తనమునకలై ఉండాల్సిన రైతన్న యూరియా బస్తా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి పరిణమించిందని కామెంట్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నడి బజారులో నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులను వంచించి, వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసిన కాంగ్రెస్ అరాచక పాలనపై అన్నదాతలు పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వయంగా వరంగల్ (Warangal) వేదికగా ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ (Farmer Declaration) ఏమైందని ప్రశ్నించారు. ఒక్కో రైతుకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. దీంతో ఆర్థిక భారంతో కుదేలైన రైతన్న బ్యాంకులు, సహకార సంఘాల్లో అప్పులు తీర్చేందుకు అవస్థలు పడుతున్నారని ఫైర్ అయ్యారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్లలోకి చొరబడి సామగ్రి, బిందెలు, ఇంటి తలుపులతో సహా జప్తు చేస్తున్న ఘటనలు ఈ ఇందిరమ్మ రాజ్యంలో చూస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం రైతు భరోసా ఇచ్చి అదే గొప్ప అని చెప్పుకోవాలనిచ చూస్తే.. రైతుల నుంచి ప్రభుత్వం ప్రతిఘటన ఎదుర్కొవాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.






