ఎర్రగడ్డ ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఫుడ్ కాంట్రాక్టర్, ఆర్ఎంవో డాక్టర్ సస్పెండ్

by Ajay Maddhiboyina |

ఎర్ర‌గ‌డ్డ మెంటల్ ఆసుప‌త్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్​ అయ్యింది. రోగుల‌కు క‌లుషితాహారం స‌ర‌ఫ‌రాపై ప్ర‌భుత్వం తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసింది.

ఎర్రగడ్డ ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఫుడ్ కాంట్రాక్టర్, ఆర్ఎంవో డాక్టర్ సస్పెండ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎర్ర‌గ‌డ్డ మెంటల్ ఆసుప‌త్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్​ అయ్యింది. రోగుల‌కు క‌లుషితాహారం స‌ర‌ఫ‌రాపై ప్ర‌భుత్వం తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో ఆహార పదార్థాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డితో పాటు, ఆర్ఎంవో డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. ఈ ఘటనలో భూపాల్‌పల్లికి చెందిన కరణ్ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోగా మరో 92 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కలుషితాహారం ఘటనకు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యమే కారణం అని గుర్తించారు. ప్రస్తుతం ఉస్మానియాకు చెందిన వైద్యుల బృంధాన్ని ఎర్ర‌గ‌డ్డ‌కు ర‌ప్పించి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మిగిలిన‌వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోమ‌వారం రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా చ‌క్కెర ప‌ర‌మాన్నం రోగుల‌కు పెట్టారు. దీంతో పాటూ పండ్లు, పాలు, గుడ్లు అందించారు. తిన్న త‌ర‌వాత డీసీ వార్డు, కోర్టు వార్డుల్లో రోగుల‌కు వాంతులు, విరేచ‌నాలు అయ్యాయి. డీసీ వార్డులో ఉన్న క‌ర‌ణ్ జ్వ‌రం మ‌రియు ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో తీవ్ర అనారోగ్యానికి గురై మంగ‌ళ‌వారం చ‌నిపోయాడు.

Next Story