Harish Rao : తాగునీటి ఎద్దడిపై ఫోకస్ పెట్టండి : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |

రాష్ట్రంలో తాగునీటి ఎద్ధడి(Drinking Water)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీష్ రావు(Harish Rao)డిమాండ్ చేశారు.

Harish Rao : తాగునీటి ఎద్దడిపై ఫోకస్ పెట్టండి : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో తాగునీటి ఎద్ధడి(Drinking Water)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీష్ రావు(Harish Rao)డిమాండ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారంటూ సంబంధిత వీడియోను హరీష్ రావు ఎక్స్ లో పోస్టు చేశారు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్, టేకుల్ కోడ్ గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారని గుర్తు చేశారు. వేసవికాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ముందు ముందు ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సంక్షేమ పథకాల్లో ఎలాగూ కోతలు విధిస్తున్నారని.. కనీసం తాగు నీటి కొరత అయినా లేకుండా చూడండని హరీష్ రావు డిమాండ్ చేశారు. పలు ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా..ప్రజా క్షేత్రంలో ప్రశ్నిస్తున్న హరీష్ రావు తాజాగా హోంగార్డుల వేతన బకాయిలపైన ప్రశ్నించారు. గండిపేట కాళీ మందిర్ వద్ధ కూల్చివేతలపైన, రియల్టర్ల ఆత్మహత్యలపైన, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కులగణన సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావు త్వరలో పాదయాత్రకు కూడా సిద్ధపడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

Next Story