నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద

by Elthuri vijay kumar |

ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు, ప్రస్తుత నీటి మట్టం 588.30 అడుగులు, గరిష్ట స్థాయి 590 అడుగులు

నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద
X

నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద

- ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

- ప్రస్తుత నీటి మట్టం 588.30 అడుగులు, గరిష్ట స్థాయి 590 అడుగులు

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు 6 క్రెస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 47,532 క్యూసెక్కుల నీటిని విడిచారు. జలాశయ గరిష్ట స్థాయి 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 588.30 అడుగులుగా నమోదైంది. గరిష్ట నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 306.98 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32,561 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. అదనంగా, కుడికాల్వకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,200 క్యూసెక్కులు, ఎస్‌.ఎల్‌.బి.సి ద్వారా 2,400 క్యూసెక్కులు, లోలెవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం విడుదల అవుతున్న నీరు 98,350 క్యూసెక్కులు కాగా, ఇన్ఫ్లో మాత్రం 1,80,426 క్యూసెక్కులుగా నమోదైంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున అవసరాన్ని బట్టి గేట్లను మరింత పెంచి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

Next Story