- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెరుగుతున్న వరద.. ముందస్తు చర్యలు శూన్యం
తిరుమలాయపాలెం మండల పరిధి అజ్మీర తండా శివారులోని, రాకాసి తండా సమీపంలోని ఆకేరులో మంగళవారం సాయంత్రానికి వరద క్రమం క్రమంగా పెరుగుతుంది.

దిశ, తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండల పరిధి అజ్మీర తండా శివారులోని, రాకాసి తండా సమీపంలోని ఆకేరులో మంగళవారం సాయంత్రానికి వరద క్రమం క్రమంగా పెరుగుతుంది. ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికారులు మాత్రం ఆదమరిచినట్టు వ్యవహరిస్తున్నారని,రాకాసి తండా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది తెల్లవారుజామున అకస్మాత్తుగా వచ్చిన వరద రాకాసి తండాలో పెను విషాదాన్ని నింపింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న,అప్రమత్తంగా ఉండవలసిన అధికారులు ఆదమరిచినట్లే ఉన్నారని, ఇంతవరకు తహసీల్దార్, ఎంపీడీఓలు కానీ, ఆ ప్రాంతాన్ని పరిశీలించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఆకేరు నార్మల్ గా ఉన్నప్పటికీ,వరంగల్, మహబూబాబాద్ లో కురుస్తున్న వర్షాలకు,చీకటి పడే సరికి ఆకేరుకు క్రమక్రమంగా వరద పెరుగుతుంది.
ఇలాగే వరద పెరుగుతూ..ఇంకొంత సమయం కొనసాగితే,అకేరుపై నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ కు అనుకుని,దాని ద్వారా వరద వెన్నక్కి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.అదే జరిగితే మళ్ళీ గత ఏడాదిలాగే,రాకాసి తండాకు పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నదని,ఆ తండా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
గత ఏడాదే ఆకేరు వరద తాకిడికి, కట్టుబట్ట తప్ప ఏమీ మిగల్లేదని,సర్వం కోల్పోయామని,ఇప్పుడు గంట గంటకు ఆకేరు వరద పెరుగుతున్నా.. అధికారులెవరు కనీసం కన్ను ఎత్తైన చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మండల అధికారులు తహసీల్దార్ లూథర్ విల్సన్,ఎంపీడీఓ షేక్ సిలార్ సాహెబ్ లను"దిశ పత్రిక" చరవాణి ద్వారా సంప్రదించగా, వారు సమాధానం ఇవ్వలేదు.కాగా ఈ విషయాన్ని ఎస్సై జగదీష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.






