జూరాలకు కొనసాగుతున్న వరద.. 13 గేట్లు ఎత్తివేత

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-09 16:53:06  IST  )

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గద్వాల జోగులాంబ జిల్లాలోనే జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుంది.

జూరాలకు కొనసాగుతున్న వరద.. 13 గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్ డెస్క్/ దిశ, ప్రతినిధి జోగులాంబ: కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గద్వాల జోగులాంబ జిల్లాలోని జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద పోటేత్తుతుంది. దీంతో అధికారులు 13 గేట్లు (13 Gates) ఎత్తి 92,997 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, 31,913 క్యూసెక్కుల నీటిని వదిలి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులైన కోయిల సాగర్‌కు 315 క్యూసెక్కులు, రైట్ మెయిన్ కెనాల్‌కు 700 క్యూసెక్కులు నీటిని ఇరిగేషన్ అధికారులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,25,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1,25,971 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 318.310 మీటర్లుగా ఉంది. ఇక ఈ నీరంతా దిగువన గల శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సైతం వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

Next Story