నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా పెరిగిన వరద.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల

by Naga Rani Yarlagadda |

నాగార్జున సాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project)కు మరోసారి వరద భారీగా పెరిగింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా పెరిగిన వరద.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project)కు మరోసారి వరద భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు భారీగా వరదనీరొచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులకు చేరడంతో మరోసారి ప్రాజెక్టు 8 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 65,842 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,09,952 క్యూసెక్కులుగా ఉంది.

కాగా.. తెలంగాణకు వాతావరణశాఖ (Heavy Rain Alert for Telangana) భారీ వర్షసూచన చేసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Next Story