హనుమకొండలో వరద బీభత్సం..జలదిగ్బంధంలో పలు కాలనీలు

by Ajay Maddhiboyina |

హనుమకొండలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో బస్టాండ్, రైల్వే స్టేషన్ సహా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. హంటర్ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లోకి వరద నీరు చేరింది.

హనుమకొండలో  వరద బీభత్సం..జలదిగ్బంధంలో పలు కాలనీలు
X

దిశ, వెబ్ డెస్క్: హనుమకొండలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో బస్టాండ్, రైల్వే స్టేషన్ సహా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. హంటర్ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని రెస్య్యూ బృందం తాడు స‌హాయంతో బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చింది. మ‌రోవైపు లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రామకృష్ణ, రెవెన్యూ కాలనీ దగ్గర సుబేదారి పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తాళ్ళు, జెసిబి ల సహాయంతో వరద బాధితులను తరలిస్తున్నారు.

Next Story