'లిక్కర్ డాన్ హటావో తెలంగాణ బచావో'.. ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్

by Dishanational2 |
లిక్కర్ డాన్ హటావో తెలంగాణ బచావో.. ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. నగరంలో మొదలుకుని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా రోడ్లపై ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ గురువారం ఖమ్మం జిల్లాలో మహిళలు బిందలతో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కవితకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. లిక్కర్ స్కాంలో దొరికిన కవితను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ విద్యార్థి, ఓయూ జేఏసీ నేతలు ఫ్లెక్సీలను అమర్చారు. 'లిక్కర్ డాన్ హటావో తెలంగాణ బచావో'అని పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్‌ను పోలీసులు తొలగించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.


Next Story