- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారి మార్చుకున్న మొంథా.. తెలంగాణకు భారీ ముప్పు.. వాతావరణశాఖ కీలక హెచ్చరిక
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 16 జిల్లాలకు..

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాను తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 16 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. మొంథా తుపాను ముప్పు ఆంధ్రా నుంచి తెలంగాణ వైపుకు మళ్లినట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న తుపాను భద్రాచలంకు 50 కిలోమీటర్లు, ఖమ్మంకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. తుపాను ప్రభావంతో మూడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
మూడు జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, సిద్ధిపేట, యాదాద్రి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జార చేసింది.
కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.






