Electric Shock : జెండా ఆవిష్కరణలో అపశృతి..ఒకరు మృతి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-19 09:06:19  IST  )

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి(Chhatrapati Shivaji Maharaj's birth anniversary)సందర్భంగా జెండా ఆవిష్కరణ(Flag hoisting) చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్(Electric shock) తగిలి ఒకరు మృతి(One person died)చెందగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాల(Seven people were seriously injured)య్యాయి.

Electric Shock : జెండా ఆవిష్కరణలో అపశృతి..ఒకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి(Chhatrapati Shivaji Maharaj's birth anniversary)సందర్భంగా జెండా ఆవిష్కరణ(Flag hoisting) చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్(Electric shock) తగిలి ఒకరు మృతి(One person died)చెందగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాల(Seven people were seriously injured)య్యాయి. సిద్ధిపేట జిల్లా(Siddipet District) వర్గల్ మండలం(Vargal Mandal), జబ్బపూర్(Jabbapur)లో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో జెండా ఆవిష్కరణ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

జెండా ఆవిష్కరించే క్రమంలో జెండా పైప్ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్తు షాక్ కు దారితీసిందని తెలుస్తుంది. ప్రమాదంలో విద్యుత్తు షాక్ తో ఒకరు మృతి చెందగా..తీవ్రంగా గాయపడిన ఏడుగురిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా హిందు సంస్థలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో జబ్బపూర్ లో సైతం శివాజీ జయంతి వేడుకలు నిర్వహిస్తుండగా...విద్యుత్తు షాక్ ప్రమాదం చోటుచేసుకోవడం బాధితుల కుటుంబాలను విషాదానికి గురి చేసింది. పోలీసులు తక్షణ సహాయక చర్యలు చేపట్టి మరింత ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు.

Next Story