- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఐదుగురు కూలీలు దుర్మరణం
ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కూలీలు మృతి చెందగా.. మరో పది మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, చివ్వెంల: ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కూలీలు మృతి చెందగా.. మరో పది మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రంలో కోరాపూట్ జిల్లాకు చెందిన 32 మంది వలస కూలీలు గత రెండు నెలల క్రితం హైద్రాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేయడానికి వచ్చారు. వీరి పనులు ముగిసిన అనంతరం వారి స్వంత రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇటీవల హైద్రాబాద్ ప్రాంతాల్లో వీరు పనిచేసే కోఠి, జీడిమెట్ల ప్రాంతాల్లో పనులు జరుగుతుండడంతో..తిరిగి భవన నిర్మాణ పనులు చేయడానికి గురువారం ఉదయం సమయంలో చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ట్రావెల్ బస్సులో హైద్రాబాద్‌కు పయనమయ్యారు.
చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ స్టేజీ వద్ద ఖమ్మం-హైద్రాబాద్ జాతీయ రహదారిపై లారీ టైర్ పగిలిపోవడంతో లారీని పక్కకు నిలిపారు. వలస కూలీలతో వస్తున్న ట్రావెల్ బస్సు పొగమంచు కారణంగా లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఐదుగురు వలస కూలీలు మృతిచెందారు. రూపు హారిజన్(51), సూల హరిజన్(46), సునమణి హరిజన్(61), ప్రత్యుష్ ప్రభాత్ హరిజన్(17), ఒడిషా రాష్ట్రంలోని నబరంగపూర్ జిల్లాకు చెందిన లహరికన్ని గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్ సునిల్ గోల్డ్(37) అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
వీరితో పాటు మరో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కుని ఉన్న 5 మృతదేహలను, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా సూర్యాపేట జనరల్ హస్పిటల్‌కు తరలించారు. గంటకు పైగా ట్రాఫిక్ జాం కావడంతో సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో.. సహయక చర్యలతో చేపట్టారు. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, సంఘటనా స్తలానికి చేరుకుని, ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల సంబంధీకుడు తల్వాడ లాభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వల్లపు మహేశ్వర్ తెలిపారు.






