- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhadradri Flooding: వరదలో చిక్కుకున్న ఐదుగురు.. చెట్ల పైకి ఎక్కి సాయంకోసం అరుపులు
by Malleboina Mahesh |
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గోదావరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని ప్రధాన నదులు, డ్యామ్ లు నిండు కుండల్లా మారిపోయాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గోదావరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని ప్రధాన నదులు, డ్యామ్ లు నిండు కుండల్లా మారిపోయాయి. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లాలో ఉన్న బచ్చువారిగూడెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో పెద్దవాగు ప్రాజెక్టు పై ఉన్న గేట్లను ఎత్తడంతో ఒక్కసారిగా వరద పెరిగిపోయింది. దీంతో ఐదుగురు పశువుల కాపరులు వాగులో చిక్కుకున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడే ఉన్న చెట్టు పైకి ఎక్కారు. ఈ క్రమంలో వరద ఉధృతి అంతకు అంతా పెరుగుతుండటంతో తమని కాపాడాలని చెట్లపై నుంచి వారు కేకలు వేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది.
Next Story






