లోయర్ మానేర్ డ్యామ్‌లో జాలరి గల్లంతు.. చేపల వేటకు వెళ్లి..

by Bhanu |

కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గువ్వా రవి (43) ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు లోయర్ మానేర్ డ్యామ్‌కు వెళ్లి గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది.

లోయర్ మానేర్ డ్యామ్‌లో జాలరి గల్లంతు.. చేపల వేటకు వెళ్లి..
X

దిశ, గన్నేరువరం: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గువ్వా రవి (43) ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు లోయర్ మానేర్ డ్యామ్‌కు వెళ్లి గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. చేపల వేట కోసం తెప్పపై డ్యామ్‌లోకి వెళ్లిన రవిని, అకస్మాత్తుగా వచ్చిన గాలులు తీవ్రంగా తాకడంతో తెప్ప అదుపుతప్పి ఒడ్డుకు దూరంగా వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు.


ఈ క్రమంలో రవి తెప్పతో పాటు నీటిలో మునిగిపోయాడు. సమీపంలోనే ఉన్న మత్స్యకారులు ఈ ఘటనను గమనించి తక్షణమే తెప్పలపై సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రవికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గల్లంతైన అతడి ఆచూకీ కోసం స్థానిక జాలర్లు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.

Next Story