- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: కాంగ్రెస్ కార్యకర్తల రక్తం మరుగుతోంది.. కేటీఆర్ వ్యాఖ్యలపై మెట్టు సాయి ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఒక అపురూప దృశ్య కావ్యంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, మెట్టు సాయికుమార్ (Mettu Sai kumar) పోల్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Congress) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఒక అపురూప దృశ్య కావ్యంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, మెట్టు సాయికుమార్ (Mettu Sai kumar) పోల్చారు. కొంతమంది రోడ్ల మీదకు వచ్చి చిల్లరగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఇవాళ (గురువారం) గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. (KTR) కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా అని మెట్టు సాయికుమార్ ప్రశ్నించారు. మేం మాట్లాడితే చెవుల్లో రక్తాలు కారుతాయని హెచ్చరించారు. కేటీఆర్ ఒక పనికిరాని వ్యక్తిగా అభివర్ణించారు. తెలంగాణ ఒక్కటే కాదు.. దక్షిణ రాష్ట్రాల్లో చిల్లర వ్యక్తి కేటీఆర్ అని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ ది కాదన్నారు. బీఆర్ఎస్ నేతలపై మేము మాట్లాడాలంటే సంస్కారం అడ్డు వస్తుందని, మైక్ ముందుకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని హితవుపలికారు. కేటీఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తల రక్తం మరుగుతోందని ఫైర్ అయ్యారు. నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చిన రేవంత్ కాలి గోటికి సరిపోరు అని అన్నారు. తండ్రి పేరు మీద లుచ్చా రాజకీయాలు చేసేది కేటీఆర్ అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగి మర్చిపోయావా అంటూ కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీపై చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.






