- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్ల వెడల్పుపై చర్యలు తీసుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫిషరీస్ చైర్మన్ వినతి
గోషామహల్ నియోజకవర్గంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాలు అయిన బేగంబజార్, సిద్ధింబర్ బజార్, బేగంబజార్ ఛత్రి ప్రాంతాల్లో రోడ్ల వెడల్పుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ కార్పొరేషన్‌చైర్మన్ మెట్టు సాయికుమార్ కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గోషామహల్ నియోజకవర్గంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాలు అయిన బేగంబజార్, సిద్ధింబర్ బజార్, బేగంబజార్ ఛత్రి ప్రాంతాల్లో రోడ్ల వెడల్పుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ కార్పొరేషన్‌చైర్మన్ మెట్టు సాయికుమార్ కోరారు. ఈమేరకు ఆయన బుధవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి(హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ) పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మెట్టు సాయి రద్దీ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో, రాబోయే కాలంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ ప్రాంతాల్లో రోడ్ వెడల్పు చేపట్టాలని మంత్రిని కోరారు.
త్వరలోనే ఉస్మానియా ఆసుపత్రి, గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్మాణం ప్రారంభం కాబోతుండటంతో, ఆయా ప్రాంతాల్లో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాకపోకలకు మెరుగైన సౌలభ్యం కలిగించేందుకు రోడ్ విస్తరణ అవసరమని స్పష్టం చేశారు. ఇందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తూ.. వ్యాపారులకు, స్థానికులకు, కొనుగోలు దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖలతో చర్చించి త్వరలోనే విధానపరమైన చర్యలు చేపడతామని తెలిపారు.






