స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. వివరాలు ఇవే?

by Ramesh Naini |

ఇటీవలే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీని విజయవంతంగా పూర్తి చేసిన బోర్డు, తాజాగా స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించిన తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది.

స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. వివరాలు ఇవే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) వేగం పెంచింది. ఇటీవలే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీని విజయవంతంగా పూర్తి చేసిన బోర్డు, తాజాగా స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించిన తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకాడమిక్ అర్హతల్లో సాధించిన మార్కులు, వెయిటేజీ ద్వారా పొందిన మార్కులు, స్థానికతకు సంబంధించిన వివరాలు సహా అన్ని అంశాలను మంగళవారం అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులు తమ వివరాలను http://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని సూచించింది.

మెరిట్ లిస్ట్‌లోని వివరాలపై అభ్యంతరాలు ఉంటే, వాటిని జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేయాలని బోర్డు కోరింది. అభ్యంతరాలను అభ్యర్థి లాగిన్ ద్వారా మాత్రమే సమర్పించాలని, ఆఫ్‌లైన్‌లో పంపిన అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. అలాగే మల్టీ జోన్–I పరిధిలో ఎటువంటి పోస్టులు నోటిఫై చేయనందున, ఆ జోన్‌కు చెందిన అభ్యర్థులను ఈ భర్తీ ప్రక్రియలో పరిగణలోకి తీసుకోవడం లేదని ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెల్లడించింది.

Next Story