తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. అత్యధిక పోలింగ్ ఎక్కడంటే..?

by Muthe.Rajitha |

తెలంగాణలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.

తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. అత్యధిక పోలింగ్ ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ ముగిసి.. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మరికొన్ని చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల గెలుపు కూడా ఖరారు అయింది. అయితే రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ జరిగింది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87.93 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత సూర్యాపేటలో 87.77 శాతం నమోదైంది. ఆ తరువాత స్థానాల్లో మెదక్ (86%), నల్గొండ(81.63%), వరంగల్(81.2%), నిర్మల్(79.81%), మంచిర్యాల(77.34%), హన్మకొండ(75.6%), ములుగు(73.57%), జనగాం(71.96%), ఆదిలాబాద్(69.10%) జిల్లాలు ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story