తెలంగాణలో ప్రారంభమైన తొలి విడత జనగణన.. ఆన్‌లైన్‌లో స్వీయ గణన చేసుకున్న గవర్నర్

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్రంలో 2027 జనాభా లెక్కల (సెన్సస్) తొలి విడత ప్రక్రియ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది.

తెలంగాణలో ప్రారంభమైన తొలి విడత జనగణన.. ఆన్‌లైన్‌లో స్వీయ గణన చేసుకున్న గవర్నర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో 2027 జనాభా లెక్కల (సెన్సస్) తొలి విడత ప్రక్రియ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆన్‌లైన్ విధానంలో తన వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గవర్నర్‌తో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారుల సమక్షంలో ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ (స్వీయ గణన) ద్వారా తన జనాభా లెక్కల వివరాలను నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వారు ఆదర్శంగా నిలవడమే కాకుండా, రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు.

ప్రజలకు గవర్నర్, గవర్నర్ విజ్ఞప్తి..

పౌరులంతా తమ కుటుంబ వివరాలను సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ విధానంలో నమోదు చేసుకోవాలని గవర్నర్ కోరారు. ఖచ్చితమైన, సమగ్రమైన జనాభా లెక్కల కోసం ప్రతి కుటుంబం భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఏ ఒక్క ఇల్లూ లెక్కల్లోంచి తప్పిపోకూడదని గవర్నర్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్వీయ గణన ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రజలందరూ ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. 2027 సెన్సస్ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, దేశ ప్రగతికి తోడ్పడే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story