- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తొలి నామినేషన్ దాఖలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల సందడి మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ బై పోల్ (Jubilee Hills Bypoll) కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఇవాళ ఉదయం నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తొలి నామినేషన్‍గా (First Nomination) స్వతంత్ర అభ్యర్థిగా పెసరికాయల పరీక్షిత్ రెడ్డి ఇవాళ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.అలాగే ఇవాళ మరో స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కాగా నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో జూబ్లీహిల్స్ రాజకీయం రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. బీజేపీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
ఇండిపెండెంట్లతో ఎవరికి మేలెవరికి కీడెవరికి?:
అయితే ఈ బైపోల్‍ను మూడు ప్రధాన పార్టీలు చాలెంజ్‍గా తీసుకున్న నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు పోటీలోకి దిగుతుండటం చర్చనీయాశంగా మారింది. ఎక్కువ సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి చివరి వరకు బరిలో నిలిస్తే వారు ఏ మేరకు ఓట్లను చీల్చగలుగుతారనే చర్చ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. దీంతో స్వంతంత్ర అభ్యర్థుల పోటీ ప్రధాన పార్టీల్లో ఎవరికి మేలు చేయబోతోంది మరెవరికి ఎర్త్ పెట్టబోతోందని అనేది నవంబర్ 14న తేలనుంది.






