గో రక్షకులపై కాల్పులు జరపడం ఆందోళన కలిగిస్తుంది: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-22 16:24:33  IST  )

హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం కాల్పులు కలకలం సృష్టించాయి. పోచారంలో గో రక్షక్ అయిన సోను (ప్రశాంత్)పై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు.

గో రక్షకులపై కాల్పులు జరపడం ఆందోళన కలిగిస్తుంది: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం కాల్పులు కలకలం సృష్టించాయి. పోచారంలో గో రక్షక్ అయిన సోను (ప్రశాంత్)పై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం అందుకున్న బీజేపీ చీఫ్ రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ హుటాహుటిన సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్న సోను పరామర్శించారు. అనంతరం బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. "హైదరాబాద్‌ పోచారంలో గోవులను తరలిస్తున్న ఎంఐఎం నాయకులను అడ్డుకున్నందుకు తుపాకీతో కాల్పులు జరపడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. తీవ్రంగా గాయపడ్డ సోను (ప్రశాంత్) ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి మతవాద దాడులు రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని నిరూపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే దోషులను అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాను. హిందువుల భద్రతకు హామీ ఇవ్వలేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోతుంది" అని హెచ్చరించారు.

Next Story