- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదల్లో హీరోలుగా నిలిచిన ఫైర్ సిబ్బంది.. 6 జిల్లాల్లో 31 ఆపరేషన్స్
రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లగా.. పలు కాలనీలు జలమయమయ్యాయి. వివిధ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ తో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లగా.. పలు కాలనీలు జలమయమయ్యాయి. వివిధ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ తో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితుల నుంచి ఆరు జిల్లాల్లో 1,646 మందిని సురక్షితంగా ముంపు ప్రాంతాల నుంచి బయటకు తీసుకువచ్చినట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 31 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి రైతులు, గొర్రెల కాపరులు, విద్యార్థులు, కాలనీవాసులు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులతోపాటు పశువులను సైతం కాపాడామని వివరించారు. వరద నీరు, చీకటిని సైతం లెక్కచేయకుండా ఫైర్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించారు. కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ పరిసరాల్లో బుధవారం రాత్రి 11:30 గంటల వరకు సిబ్బంది నిరంతరం పనిచేశారని పేర్కొన్నారు.
అత్యవసర రక్షణ చర్యలకు ఓ వ్యక్తి అంతరాయం
కామారెడ్డిలోని ఒక అపార్ట్ మెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఒక వ్యక్తిని బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఫైర్ సిబ్బంది రక్షించడానికి ప్రయత్నించగా.. అతను బయటకు రాలేదని డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఆప్పుడు ఆ ప్రాంతంలో ముగ్గురిని కాపాడినట్లు తెలిపారు. అయితే బయటకు రానని చెప్పిన వ్యక్తి నిరంతరం ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తూ.. అత్యవసర రక్షణ చర్యలకు అంతరాయం కలిగించాడని చెప్పారు. తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు అత్యవసర రక్షణ చర్యలకు ఆటంకం కలిగిస్తాయని పేర్కొన్నారు.
ఆదిలాబాద్, జగిత్యాలలో ఇద్దరు చొప్పున, నిర్మల్ లో ఒకరిని రెస్క్యూ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గభీంరావు పేట్ మండలంలో నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుకురిని ఆర్మీ హెలికాప్టర్ సహాయతో రక్షించారు. కామారెడ్డి పట్టణంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది వాహనంతోపాటు కొద్దిసేపు వరద నీటిలో కొట్టుకుపోయినా.. ఆ తర్వాత క్షేమంగా బయటపడ్డారు.






