- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచివాలయంలో ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్.. ఆకట్టుకున్న ఫైర్ ఫైటింగ్ రోబో
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ అట్టహాసంగా జరిగింది.

- ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడంలో ప్రజల్లో భద్రతా పరికరాల వాడకంపై అవగాహన పెరగాలి
- తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ విక్రమ్ సింగ్ మాన్
దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ అట్టహాసంగా జరిగింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలి.. ప్రాణ, ఆస్తి నష్టాలను ఏ విధంగా నివారించాలి. అనే అంశాలపై సచివాలయ సిబ్బందికి తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం ఆధ్వర్యంలో సమగ్ర అవగాహన కల్పించారు. ఆకట్టుకున్న ఫైర్ ఫైటింగ్ రోబో డెమో.. ఈ మాక్ డ్రిల్‌లో అగ్నిమాపక సిబ్బంది పలు అత్యాధునిక ఫైర్ టెండర్లు, ఇతర ఆధునిక రక్షణ పరికరాలతో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యంగా మనుషులు వెళ్లలేని ప్రదేశాల్లో, అత్యంత వేడి ఉండే ప్రాంతాల్లో మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటింగ్ రోబో ఏ విధంగా సమర్థవంతంగా పనిచేస్తుందో సిబ్బందికి ప్రత్యక్షంగా చూపించారు.భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అలారం మోగించడం, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం, అత్యవసర పరికరాలతో మంటలను ప్రాథమిక దశలోనే అదుపు చేయడం వంటి వాటిపై డెమో ఇచ్చారు.
ఫస్ట్ రెస్పాండర్స్‌గా మారాలి.. తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిమాపక పరికరాల వినియోగంపై సాధారణ ప్రజల్లోనూ మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ రెస్పాండర్స్ గా వ్యవహరించాలి. ఇలాంటి మాక్ డ్రిల్స్ ద్వారా పొందే అవగాహనతో,ప్రాథమిక దశలోనే మంటలను ఆర్పివేస్తే చిన్న ప్రమాదాలు పెనువిషాదాలుగా మారకుండా నివారించవచ్చు. తద్వారా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాలనుఅరికట్టవచ్చు అని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జి.వి. నారాయణ రావు, విభాగానికి చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సచివాలయ సీఎస్‌వో దేవీదాస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను వీక్షించి, అగ్ని భద్రతపై అవగాహన పొందారు.






